నడుస్తున్న భోగిలో రేప్ ,  సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణ...  సికింద్రాబాద్ లో అరెస్ట్

నడుస్తున్న రైలులో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది.  సంబల్ పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రక్సౌల్ ఎక్స్ ప్రెస్   ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో కల్సి వస్తున్న ఆ బాలిక తనను విధి కాటేస్తుందని ఊహించలేకపోయింది. హార్రర్ సినిమాలను తలపించే ఈ సంఘటన అనేక ప్రశ్నలు తలెత్తేలా చేసింది. మరి కొద్ది సేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని బాలిక కుటుంబం భావించింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు కెల్తార్  రైల్వే స్టేషన్ సమీపంలో  ఉండగానే బాలిక కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. తెల్లవారు జామున తోటి ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బాలిక కుటుంబ సభ్యులు కూడా నిద్రలో జారుకోవడాన్ని నిందితుడు సంతోష్ కుమార్ (21) పసిగట్టాడు. నిందితుడు బీహార్ మంద్వాడ్ జిల్లాలో రైలెక్కాడు. అప్పటివరకు ఈ కుటుంబ సభ్యులతో మాటా మాటా కలపడంతో బాలిక కూడా ప్రమాదాన్ని ఊభించలేకపోయింది.  బాలిక టాయ్ లెట్ కు వెళ్లగానే వెంబడించి అదే టాయ్ లెట్ డోర్ వేసేసాడు.   బాలిక అరుస్తున్నప్పటికీ కేకలు భోగీలో వినిపించలేదు. బలవంతంగా రేప్ చేసిన యువకుడు ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించి వదిలేసాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే 139 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో రైల్వే పోలీసులు చేరుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్స్ కేసు నమోదైంది.అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినప్పుడు  నేరస్తులకు శిక్షలు కఠినంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పోక్సో చట్టాన్ని పాలకులు తీసుకువచ్చారు అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ నేరాలు చేసే వాళ్లు నేరాల తీరు మార్చుకుంటున్నారే గానీ నేరాలను నియంత్రించుకోలేకపోతున్నారు. చట్టాలలో ఉన్న లొసుగులు వారికి వరప్రదాయిని అవుతుంది. పిల్లల పెంపకంలో కూడా లోపాలు వారిని సమాజంలో నేరస్థులుగా నిలబెడుతున్నాయి. దిశ, నిర్బయ, పోక్స్ చట్టాలు వారిలో మార్పు తేలేకపోతున్నాయి. నేరాల శాతం తగ్గుతున్నా నేరాలను అరికట్టడంలో చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా విఫలం అవుతున్నారు