ఫిర్యాదు పై బెదిరింపు.. మళ్లీ రేప్ చేస్తా..
posted on Aug 25, 2015 5:21PM
కంప్లైట్ వెనక్కి తీసుకో లేదంటే మరోసారి రేప్ చేస్తా.. ఇది ఒక నిందితుడు బాధితురాలని బెదిరించిన విధానం. ఈ ఘటన ఎక్కడ జరగిందనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా కుర్వారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుర్వార గ్రామానికి చెందిన అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడికోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో నిందితుడు యువతిపై బెదిరింపులు మొదలుపెట్టాడు. ఇంట్లో తాను ఒంటరిగా ఉన్న సమయంలో బాధితురాలని కలిసి తనపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేకపోతే మరోసారి రేప్ చేస్తానని బెదరించాడట. దీంతో బాధితురాలు మళ్లీ నిందితుడి వైఖరిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.