రజనీ రాజకీయాలపై జోస్యం.. ముఖ్యమంత్రి కూడా అవుతారట..!
posted on May 18, 2017 12:46PM

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడకపోతేనే ఏదో ఒక రకంగా వార్తలు వస్తునే ఉండేవి. అలాంటిది తన అభిమానులతో సమావేశమై ఆయన.. సమావేశంలో రాజకీయాల గురించి చెబితే ఇంకేలా ఉంటుంది. తాను ప్రత్యక్షంగా రాను అని చెప్పినా కానీ... పరోక్షంగా మాత్రం చిన్న హింట్ ఇచ్చారు అని అంటున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల గురించి అప్పుడే కేరళలోని ప్రముఖ జ్యోతిష్యుడు జోస్యం చెబుతున్నారు. రజనీకాంత్ జాతకాన్ని ఆయన సన్నిహితుడొకరు కేరళలోని ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించగా.. రజనీకి రాజకీయాలు బాగా కలిసి వస్తాయని, ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పారట. అంతేకాదు.. రాజకీయ అరంగేట్రానికి సమయం కూడా దగ్గరపడిందని చెప్పారంట. ఇవన్నీ ఒకటైతే.. రజనీ రాజకీయ అరంగేట్రంపై అప్పుడే కథనాలు మొదలయ్యాయి. రజనీకాంత్ పార్టీ పెట్టనున్నారని, ఆ పార్టీ గుర్తు కూడా ఖరారు చేశారని, అందులో బాబా సినిమాలో సింబల్ తోపాటు కమలం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.