రాహుల్ మీద జవదేకర్ సెటైర్

 

బీజేపీ నేత, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో సెలవులపై వెళ్లినందుకు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తాయో వూహించి చెప్పొచ్చు కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తాడో మాత్రం చెప్పాలేమని అన్నారు. రెండోసారి భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ప్రతి పక్షాలన్ని కలిపి ఏప్రిల్ 19న రైతు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారనే సమాచారంపై స్పందించాలని విలేకరులు కోరడంతో జవదేకర్ పై విధంగా స్పందించారు.