దేశ ప్రతిష్ట తీసిన రాహుల్ 

అమెరికాలో మన ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వల్ల దేశ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీ గడ్డపై ఇండియా సమస్యలు, పరిష్కారాల మీద మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి లాభించేది. మోడీ పాలన గురించి విమర్శిస్తే పర్వాలేదు వ్యక్తిగతంగా దూషించడం భారత్ ను చులకన చేసినట్టయ్యింది ఎందుకంటే మోడీ చరిష్మా ఉన్న నేత. ప్రపంచంలో అత్యంత శక్తివంత ప్రధానులలో ఆయన ఒకరు. అటువంటి నేత మీదే రాహుల్ బాణాలు సంధించడం నెగెటివ్ మీనింగ్  వెళుతుంది. భార్యభర్తలు కొట్లాడుకుంటే ఆ గొడవ ఇంట్లో మటుకే పరిమితం చేస్తే బాగుంటుంది. నలుగురికి తెలిస్తే పరువుపోతుంది. మన దేశ జాతీయత భావం మోడీ హాయంలో విపరీతంగా పెరిగింది . ఈ సమయంలో  మోడీ మీద రాహుల్ విమర్శ చేయడం వల్ల కాంగ్రెస్ పరువు బజారున పడింది. 
మరికొద్ది రోజుల్లో మన ప్రధాని మోడీ అమెరికా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే రాహుల్ అమెరికా చేరుకుని మోడీని విమర్శించడం రాంగ్ మెసేజ్ వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. 

‘‘ప్రధానికి అన్ని తెలుసు అనుకుంటాడు. దేవుని కంటే తాను ఎక్కువ అనుకుంటాడు. దేవుడికే హిత బోధ చేయగలనని’’ భావిస్తాడు అని  మోడీని చులకన చేసి మాట్లాడటం మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది. ‘‘ నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాణ్ కోలింగే హమ్ ’’ అంటూ ఫక్తు రాజకీయాలే మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు.