చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన రఘునందన్ రావు
posted on Jun 12, 2024 4:27PM
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో రఘ నందన్ రావు స్పందించారు.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో... చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఆంధ్రప్రదేశ్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత, మెదక్ నుంచి లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘునందన్ రావు ఆకాంక్షించారు. ఈరోజు చంద్రబాబు ఏపీ సీఎంగా, పవన్ కల్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రఘునందన్ రావు ఎక్స్ వేదికగా వారికి శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రిగా ప్రమాణం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.