తెరాస అభ్యర్థిని నిలదీసిన కాంగ్రెస్‌ పార్టీ యువకులు

 

తెలంగాణలో శాసనసభ ముందస్తు ఎన్నికల వేళ అధికార పార్టీ అభ్యర్థులకు నిరసన సెగ తగులుతోంది. తాజాగా తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డికి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం కోటకొండలో చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక యువకులు ఆయనను అడ్డుకున్నారు. తమ గ్రామానికేం అభివృద్ధి చేశారని నిలదీశారు. కేటాయించిన గురుకుల పాఠశాల ఏమైందని ప్రశ్నించారు. మిషన్ ‌భగీరథ నీళ్లు తదితర విషయాలను రాజేందర్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు, యువకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.