రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేయనున్న ప్రభాస్
posted on Sep 13, 2022 6:11AM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆదిపురుష్ లో రాముడి పాత్రను పోషిస్తున్నప్రభాస్ కు ఈ ఏడాది దసరా వేడుకల్లో రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసే అవకాశం లభించింది.
ఈ మేరకు రామ్ లీలా కమిటీ ప్రభాస్ ను ఆహ్వానించింది. దసరా వేడుకలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 5న రామ్ లీలా మైదానంలో రావణదహనం కార్యక్రమం జరగనుంది. రావణుడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి హీరో ప్రభాస్ కు ఆహ్వానం లభించింది.
రావణుడు, కుంభకర్ణుడు, మేఘ్‌నాధ్ దిష్టిబొమ్మలను ప్రభాస్ బాణంతో దగ్ధం చేస్తారు. ఒక తెలుగు నటుడికి ఈ గౌరవం దక్కడం ఇదే మొదటి సారి. గతంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, జాన్ అబ్రహం వంటి నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.