షూటింగ్‌లో గాయం.. అయినా లెక్కచేయని పవన్
posted on Oct 22, 2017 12:55PM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ప్రియ మిత్రుడు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్న వీరిద్దరూ షూటింగ్‌లో వేగం పెంచారు. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని చిక్‌మగుళూరు ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఓ యాక్షన్ సీన్ చీత్రికరిస్తుండగా స్వల్ప ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో హీరో పవన్ కళ్యాణ్‌కి స్వల్ప గాయాలయ్యాయట. అయినప్పటికీ దానిని ఆయన లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సమాచారం తెలుసుకున్న పవర్‌స్టార్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కళ్యాణ్‌కు చిన్న గాయం మాత్రమే అయిందని.. వెంటనే చికిత్స అందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.