విద్యార్ధులకు పోలీసుల ఆయుధాల ఉపయోగం పై జ్ఞానాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులు.....

 

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు చేరువయ్యేలా పోలీస్ శాఖలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు వాటి పని తీరు వంటి వాటి పై ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరిస్తున్నారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో ఈ ప్రదర్శనను డిజిపి గౌతం సవాంగ్ ప్రారంభించారు. సాధారణ తుపాకి నుంచి ఏకే ఫార్టీ సెవన్ వరకు వివిధ రకాల ఆయుధాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటి గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే పోలీసులు కూడా ఓపిగ్గా వివరిస్తున్నారు.

టిఫిన్ బాక్స్ లు, సూట్కేసులు, డస్ట్ బిన్ లో అమర్చే బాంబుల నిర్వీర్యం గురించి ప్రత్యేకంగా వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు భవనాలు కూలినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉపయోగించే పనిముట్లను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. సెవన్ పాయింట్ సిక్స్ టూ ఎమ్ఎమ్ఎస్ఎస్జీపీ టూ ఇది షార్క్ షూటింగ్ గన్. ఈ ఆయుధానికి పై భాగంలో ఉండే టెలిస్కోప్ దూరంగా ఉన్న వ్యక్తిని పది రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. దాని ద్వారా శత్రువులను మట్టుబెట్టవచ్చు వివరించారు .

నైన్ ఎంఎం పిస్టల్ బ్లాక్ నైన్టీన్ దీన్లో నైన్ ఎంఎం బుల్లెట్లు పదిహేను రౌండ్లు ఉంటాయని యాభై అడుగుల దూరంలో ఉన్న శత్రువులను టార్గెట్ చేయవచ్చు అని దీనిపై భాగంలో గెగోటాక్టికల్ లైట్ ఉంటదిఅని విద్యార్ధులకు వివరించారు . చీకట్లో ఉన్నప్పుడు ఐఆర్ అతినీలలోహిత కిరణాలు శత్రువులపై పడేలా చేయవచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటిని మట్టుబెట్టడానికి యాభై యొక్క ఎంఎం మోర్టార్ ను ఉపయోగిస్తాము అని అల్లర్లు జరిగే సందర్భాల్లో యాంటీ రాయిట్ గన్ ను ఉపయోగిస్తామని పోలీసులు ప్రదర్శనలో వెల్లడించారు.

తాము వాడే వస్తువుల పై కొంత పరిజ్ఞానాన్ని ప్రజలకు, విద్యార్ధులకు చాలా ఓపిగ్గా సమాచారం ఇచ్చారు పోలీసులు.ఈ ప్రదర్శన చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఇతర ప్రజలు కూడా ఆసక్తిగా తరలి వస్తున్నారు.