నాలుగేళ్ళలో పోలవరం పూర్తి
posted on Mar 29, 2015 2:23PM

కేంద్రం సహకారంతో నాలుగేళ్ళలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించామని చెప్పారు. ఆదివారం పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గోదావరి జిల్లాలకు అన్యాయం జరగనివ్వం. సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే మళ్ళిస్తాం. ఉభయగోదావరి, అనంతపురం జిల్లాల ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారు. వైఎస్ హయాంలో ముడుపులు, కమిషన్ల కోసం కాలువలు తవ్వారు. పోలవరంపై అశ్రద్ధ లేదని కేంద్రం చెప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఎకరానికీ నీళ్ళిచ్చే బాధ్యత నాది. గోదావరి, కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేసుకుంటే కరువు పరిస్థితులు వుండవు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడానికి ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టాం’’ అన్నారు.