గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేల సవాల్..144 సెక్షన్
posted on Aug 29, 2016 10:05AM
గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాల్ ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. పుష్కర పనుల్లోఅవినీతికి పాల్పడ్డారంటూ గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌పై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యరపతినేని..విచారణకు తాను సిద్ధమని..వాటిని నిరూపించకపోతే పిన్నెల్లి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దీంతో దాచేపల్లి మార్కెట్ యార్డులో ఇరు వర్గాలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. ఇరు వర్గాల సవాల్‌తో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గురజాల రెవన్యూ డివిజన్‌లో 144 సెక్షన్ విధించారు. దాచేపల్లిలో బందోబస్తు పెంచి, ముందు జాగ్రత్త చర్యగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గృహ నిర్బంధం చేశారు.