పవన్ కల్యాణే మా సీఎం అభ్యర్థి..!

 

పాలించడానికి కాదు ప్రశ్నించడానికి అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు.. అన్నట్టుగానే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ,బీజేపీ పార్టీలకు మద్దతిచ్చారు.. తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు.. అలా అలా ప్రశ్నించడం కాస్త విభేదించడంగా మారి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోరుకి సిద్ధమయ్యారు.. ఇప్పటికే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న పవన్, ఓ వైపు ప్రజలకు మరోవైపు వామపక్షాలకు దగ్గరవుతున్నారు.. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పవన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని, మహా కూటమి ఏర్పడితే సీఎం అభ్యర్థి ఆయనే అని రామకృష్ణ అన్నారు.. ప్రజల్లో పవన్‌కు ఇమేజ్‌, క్రేజ్‌ రెండూ ఉన్నాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu