పటాస్ మూవీ రివ్యూ

 

బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, శృతి సూద్, సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ రెడ్డి, పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను.

 

సంగీతం: సాయి కార్తీక్‌, కూర్పు: తమ్మిరాజు, కెమెరా: సర్వేష్‌ మురారి, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కథ, మాటలు, కథనం, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

 

‘అతనొక్కడే’ సినిమా తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్‌రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘పటాస్’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కళ్యాణ్‌ సిన్హా (కళ్యాణ్‌ రామ్‌) పోలీసు ఆఫీసర్‌గా ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి తన కింద పనిచేసే పోలీసులందరినీ అవినీతికి పాల్పడమని ప్రోత్సహిస్తూ వుంటాడు. వాళ్ళ అవినీతి సంపాదనలో తాన షేర్ తీసుకుంటూ వుంటాడు. అదేవిధంగా టీవీ జర్నలిస్టు శ్రుతి సూద్‌ని ప్రేమిస్తున్నానంటూ  వెంటపడుతూ వుంటాడు. ఇంకోవైపు సిన్సియర్ పోలీసు ఆఫీసర్ సాయికుమార్ని టీజ్ చేస్తూ వుంటాడు. విలన్ అశుతోష్ రాణాకి సహకరిస్తూ వుంటాడు. చివరికి కళ్యాణ్ రామ్ ఎలా ఉత్తముడై దుర్మార్గులను అరికట్టాడన్నది ‘పటాస్’ సినిమా కథాంశం.

 

కళ్యాణ్ రామ్ తన తన ఇమేజ్‌కి భిన్నంగా కామెడీ చేశాడు. నటుడిగా మంచి మార్కులనే పొందాడు. హీరోయిన్ శ్రుతి సోసోగా వుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్లో సాయికుమార్ ఇరగదీశాడు. ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్. నారాయణ శుక్రవారం నాడు మరణించారు. కానీ ఆయన ఒక మంచి కామెడీ పాత్ర ధరించిన ‘పటాస్’ శుక్రవారం నాడే విడుదల కావడం కాకతాళీయం. ఈ సినిమాలో ఆయన ‘సునామీ స్టార్’ సుభాష్ పాత్రలో నటించి బాగా నవ్వించారు. ఆయన ప్రేక్షకులను నవ్విస్తూనే కంటతడి పెట్టించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సినిమా అంతా మంచి కామెడీ వుంది. జయప్రకాష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి మంచి కామెడీ పంచారు. దర్శకుడిగా అనిల్ రావిపూడి తన మొదటి సినిమాతోనే ప్రశంసలు పొందుతారు. మొత్తానికి ‘పటాస్’ సినిమా వినోదాత్మకంగా వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu