27 మంది ఎంపీల సస్పెన్షన్

 

పార్లమెంట్ ఉభయ సభలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునుండే విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ సభలు అట్టుడికిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు సభను సరిగా జరగకుండా ఆరోపణలు చేస్తూనేఉన్నారు. లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభ ప్రారంభమైన దగ్గర నుండి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రెండు సార్లు సభ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన కూడా తిరిగి అదే పరిస్థితి కొనసాగింది. మంత్రులు రాజీనామా చేసే వరకూ సభను సాగనివ్వబోమని.. విపక్ష ఎంపీలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. సభకు అందరూ సహకరించాలని కోరినా కూడా వినకపోవడంతో 377 రూల్‌ ప్రకారం 27 మంది ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.