నేను పాకిస్తాన్ ఉగ్రవాదిని.. పాకిస్తాన్ సమాధానం ఏంటో?



జమ్ము కాశ్మీర్ లోని ఉదంపూర్ లో నలుగురు ఉగ్రవాదులు చొరవబడిన సంగతి తెలిసిందే. వీరిపై భారత సైన్యం కాల్పులు జరపగా ముగ్గురు హతమవ్వగా సాజద్ అహ్మద్ అనే ఒక ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. అయితే దీనికి సంబంధించి ఆర్మీ అధికారులు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

 
ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు  ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి అడుగుపెట్టి బుధవారం తెల్లవారుజామున యూరి రఫియాబాద్‌ మధ్య ఖఫీర్‌ఖాన్‌ కొండల నుంచి కిందికి దిగుతున్నట్లు గుర్తించామని.. దాంతో వెంటనే అప్రమత్తమై అనేక మంది జవాన్లతో కలిసి ఉగ్రవాదులను వెంబడించామని తెలిపారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టామని మిగిలిన వారికోసం గురువారం తెల్లవారుజాము వరకు గాలించగా ఒక గుహ నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు దీటుగా కాల్పులు జరిపామని తెలిపారు. అయితే కొద్దిసేపటికి గుహ లోపలి నుండి కాల్పులు ఆగిపోగా తర్వాత జవాన్లు గుహలోకి గుహలోకి ‘మిర్చీ బాంబు’ (చిల్లీ గ్రెనేడ్‌) ప్రయోగించి, జాగ్రత్తగా గుహలోకి ప్రవేశించారు. అయితే అక్కడ... ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించగా మరో ఉగ్రవాది... కళ్లనీళ్లు పెట్టుకుంటూ నేలపై కూర్చుని నన్ను‘చంపొద్దు’ అంటూ జవాన్లను వేడుకున్నాడు.

 

దీంతో జవాన్లు ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకొని విచారించగా అసలు కథ బయటపడింది. తన పేరు సాజద్ అహ్మద్ అని.. తను నైరుతి పాకిస్థాన్‌లోని ముజఫర్‌గఢ్‌ కి చెందినవాడినని చెప్పాడు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజు పాక్ పై మండిపడ్డారు. మరో ఉగ్రవాది సజీవంగా పట్టుబడటంతో పాక్‌ కుట్రలు బట్టబయలయ్యాయని అన్నారు.

 

అయితే గత కొద్దిరోజుల క్రితం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ప్రాంతంలో మహ్మద్ నవేద్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. దీనిపై బొంకిన పాకిస్థాన్ ఇప్పుడు సాజాద్ అహ్మదే తాను పాకిస్తాన్ ఉగ్రవాదినని తెలిపాడు. మరి అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.