పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించండి : కాంగ్రెస్ నేత కపిల్ సిబల్

 

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు తగ్గాయని ఆయన తెలిపారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉన్న రోజుల్లో భారత సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఉగ్రవాదం కూడా తగ్గుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశానికి నిజమైన సమస్య టెర్రరిజమేనని పేర్కొన్నారు. 

అందుకే మన విదేశాంగ విధానం పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందనే వాస్తవంపై ఇప్పటికైనా ఎన్డీయే సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. దాయాది పోషిస్తున్న టెర్రరిజంపై ప్రపంచ దేశాలకు అసలు వాస్తవాలను ముందుంచి.. పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమ కార్యకలాపాల  చట్టంలో కొన్ని సవరణలు తప్పనిసరి అని కపిల్ సిబల్ అన్నారు.