ఏపీ రాజ్యసభ ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణ

 

 

ఏపీలో ఖాళీ అయిన  రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. భీమవరం బీజెపి క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ పేరును కమలం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాక గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా పాక పేరును ప్రకటించారు. 

ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి తిరుగుపయనంలో దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ స్థానానికి ఎస్సీ వర్గీకరణలో కీలకంగా వ్యవహరించిన నేత, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  తమిళనాడుకు చెందిన అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu