ఒకవైపు తెలంగాణ వేడుకలు... మరోవైపు విద్యార్ధుల దర్నా
posted on Jun 2, 2015 5:04PM

ఒక పక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతుంటే మరోపక్క ఓయూ విద్యార్ధులు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో ముఖ్య భూమిక పోషించిన ఓయూ విద్యార్ధులే కేసీఆర్ కు వ్యతిరేకంగా దర్నా చేపట్టారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, దానితో పాటు ఓయూ భూముల విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులంతా నల్లజెండాలతో తమ నిరసనను తెలుపుతూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించారు. అయితే పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు ఓయూ వెళ్లే దారులను బ్యారీకేడ్లతో, ముళ్లకంచెలతో ఎక్కడికక్కడభద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఓయూ నాయకులను ముందే అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులకు ఓయూ విద్యార్ధులకు వాగ్వాదం జరగడంతో కొంతమంది విద్యార్ధులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.