హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
posted on May 7, 2025 9:55PM
.webp)
ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో భద్రత కట్టదిట్టం చేయాలని అధికారులను సూచించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఎలా స్పందించాలనే దానిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అత్యవసర సేవలు నిరవధికంగా అందుబాటులో ఉండేలా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సీఎం సూచించారు.హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను అమలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక, శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ వద్ద భద్రతను మరింత బలపర్చాలన్న ఆదేశాలు జారీ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించాలని అధికారులకు సూచించారు. భద్రతా సమాచార వ్యవస్థను సమర్ధవంతంగా సమన్వయం చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భాగ్య నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.