ప్రధాని మోడీతో కరణం మల్లీశ్వరి భేటీ

ఒలింపిక్స్‌ పతకం విజేత, ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. హర్యానాలోని యమునానగర్ లో ఈ భేటీ జరిగింది. కరణం మల్లీశ్వరితో భేటీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.  

క్రీడాకారిణిగా కరణం మల్లీశ్వరి సాధించిన విజయాలు దేశానికి  గర్వకారణమని పేర్కొన్న మోడీ  క్రీడల్లో ఆమె ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రీడా రంగంలో వ్యక్తిగత విజయాలతో పాటు, భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కరణం మల్లీశ్వరి చేస్తున్న కృషిని ప్రశంసించారు క్రీడాకారిణిగా, మార్గదర్శిగా ఆమె సేవలు దేశానికి ఎంతో విలువైవని మోడీ ఆ పోస్టులో పేర్కొన్నారు.