చంచల్‌గూడాకి ఓబులేశు

 

హైదరాబాద్ కేబీఆర్ పార్కు దగ్గర అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి మీద ఏకే 47 గన్‌తో కాల్పులు జరిపిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ ఓబులేశును హైదరాబాద్ పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు మీద విచారణ చేపట్టిన కోర్టు ఓబులేశుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్ విధించింది. అనంతరం ఓబులేసును పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఓబులేసును తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. నిత్యానందరెడ్డి మీద కాల్పులు జరిపిన తర్వాత తప్పించుకుపోయిన ఓబులేశును అనంతపురం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. విలాసాలకు డబ్బు సంపాదించడం కోసమే ఓబులేశు ఈ పనికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.