చెవిరెడ్డికి సుప్రీంలో గూబగుయ్యి!
posted on Jun 3, 2024 2:40PM
చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గ పరిధిలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్లను మళ్లీ స్కృటినీ చేయాలనీ, అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆన సుప్రీం ను ఆశ్రయించారు.
అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది.అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి చెబుతున్నారు.
దీనిపై హైకోర్టును ఆశ్రయించిన మోహిత్ రెడ్డి హైకోర్టు అందుకు సమ్మతింకకపోవడంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం మోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు తీర్పును సమర్ధించింది.