సుప్రీంలో అవినాష్ కు మళ్లీ చుక్కెదురు

డప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మళ్లీ చుక్కెదురైంది.   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఆయన మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 వెకేషన్  చ్ ముందు ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.  జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. కాగా అవినాష్ పిటిషన్ ప్రస్తుతం విచారించలేమని పేర్కొంటూ సుప్రీం కోర్టు తిరస్కరించింది.

దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఇక అనివార్యం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.