కేసీఆర్ కి మరో షాక్...ఈసారి ఎవరంటే ?
posted on Jul 11, 2019 3:24PM
.jpg)
తెలంగాణా సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. అయితే అది భవనాల కూల్చివేత అంశంలోనే. ఇప్పటికే తాము చెప్పే వరకూ ఆ భవనాలు కూల్చే ప్రయత్నం ఏమీ చేయొద్దని చెప్పిన కోర్టుకి మరొకరు వెళ్లి ఆయనకు షాక్ ఇచ్చారు. కేసీఆర్ తీసుకున్న కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఏడు పిటిషన్లు ఇప్పటివరకు హైకోర్టులో దాఖలు అయ్యాయి .తాజాగా నిజాం వారసులు కూడా పిటీషన్ వేశారు. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేతపై నిజాం వారసులు కోర్టుకెక్కారు. ఆ ప్యాలెస్ కి సంబంధించి 12 ఎకరాలకు తాలూకా తమకు పరిహారం రావాల్సి ఉందని అది ఇచ్చే వరకు కూల్చివేతలు చేపట్టకుండ స్టే ఇవ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.
దీంతో హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎర్రమంజిల్‌లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి 1951లో ప్యాలెస్ దాని చుట్టూ ఉన్న 12 ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదు అప్పటి ప్రభుత్వం . దీంతో నిజాం వారసులు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. గతంలో అనేకసార్లు కోర్టును ఆశ్రయించినా కేసు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనం నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడంతో నిజాం వారసులు మరోసారి హైకోర్టు కు వెళ్లారు.