మరోసారి వివాదంలో నిత్యానంద స్వామి... బొలివియా దేశంలో భూ దందా
posted on Apr 4, 2025 11:54AM
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుక్కున్నారు. నిత్యానంద స్వామి చనిపోయినట్టు ఆయన మేనల్లుడు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో మేనమామతో వచ్చిన విభేధాల వల్ల మేనల్లుడు ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. సినీ నటి రంజితతో నిత్యానంద స్వామి కి అఫైర్ ఉందని వార్తలు గుప్పుమనడంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి అమెరికాలోని ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశానికి తానే ప్రధాని అని చెప్పుకున్నారు. తన వారసురాలిగా సినీ నటి రంజిత అని ప్రచారం జరిగింది. ఆస్తుల విషయంలో నిత్యానందస్వామి మేనల్లుడికి రంజిత మధ్య విభేధాలున్నాయి. ఈ కారణంగా ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీన నిత్యానందస్వామి చనిపోయినట్టు మేనల్లుడు ప్రకటించారు. మేనల్లుడు చేసిన ప్రకటనను నిత్యానంద స్వామి శిష్యులు ఖండిస్తూ ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు.
ఈ వివాదం వారం రోజులు గడవకముందే బొలివియా దేశంలో నిత్యానందస్వామి భూ దందా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యానందస్వామి అనుచరులు బొలివియా దేశంలోని గిరిజనులు ఆవాసముండే భూములపై కన్నేశారు. గిరిజన ప్రజల అమాకత్వం, పేదరికం ఆసరాగా చేసుకుని నిత్యానంద స్వామి శిష్యులు భారీ స్కెచ్ వేశారు. వందల ఎకరాల భూములను కొట్టేయాలని చూశారు. స్థానిక గిరిజన తెగలతో వందేళ్ల లీజు అగ్రిమెంట్లు చేసుకున్నారు. వెంటనే బొలివియా ప్రభుత్వం అప్రమ్తమైంది. ఈ లీజు ఒప్పందాలను రద్దు చేసింది. కైలాస దేశంలో ఉన్న 20 మందిని అరెస్ట్ చేశారు. అమెరికాలో ఐల్యాండ్ లో కైలాస ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి బొలివియాలో కూడా కైలాస దేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.