సీతారామన్ స్టేట్ మెంట్.. కొత్తగా చేరిన 16 లక్షల మంది పన్ను చెల్లిపుదారులు

ఆర్ధికరంగం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో నిర్మల సీతారామన్ ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ రాయితీల కోసం కార్పొరేట్ రంగాలు సైతం ఎదురు చూస్తున్నాయి.15వ ఆర్ధిక సంఘం రిపోర్టును సభలో ప్రవేశ పెడుతూ.. 2020-2021 బడ్జెట్ ను సైతం సభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యొల్బణాన్ని పరిశీలించి అదుపులో పెట్టడమే కాక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్ధిక సంస్కరణలు వేగవంతం చేశామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆర్ధిక రంగ మూలాలు బలంగా ఉన్నాయి కానీ ఆర్ధిక సంస్కరణల్లో జీఎస్టీ చాలా కీలకమైనదనే అంశాన్ని గుర్తు చేశారు. జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ లాంటి వారు ముందు చూపుతో వ్యవహరించారని.. పాలన రంగంలో పూర్తి స్థాయి మార్పులు తీసుకువచ్చినట్లు సీతారామన్ తెలియజేశారు. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారని రిటర్న్స్ లో సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్స్ ను ఫైల్ చేశారని సబ్ కా సాథ్, సబ్కా వికాస్ పథకాలు వేగంగా ప్రజలుకు చేరుతున్నాయని సీతారామన్ వెల్లడించారు. ఏప్రిల్ 2020 నుంచి పన్ను రిటర్నులకు మరింత సులభంగా ఉంటుందని అన్నారు.

ప్రపంచంలో ఇప్పుడు భారతదేశానిది అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అని సీతారామన్ తెలియజేశారు. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి 4 శాతం ఆదా అయిందని, కేంద్ర ప్రభుత్వ రుణాలు గణనీయంగా తగ్గాయని ఆవిడ వెల్లడించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికి చేరేలా చూడడమే తమ లక్ష్యమని 2014-2019 మధ్య ఎఫ్ డీఐ లు 119 బిలియన్ డాలర్ల నుంచి 284 డాలర్లకు పెరిగాయని.. వృద్ధి రేటు 7.4 శాతం సాధించామని సీతారామన్ వెల్లడించారు. భారత ప్రజలు మోదీకి తిరుగులేని తీర్పు ఇచ్చారని.. రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్ధిక పురోగతి ఆశిస్తూ అధికారమిచ్చారని సీతారామన్ వెల్లడించారు. అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతమిచ్చెలా బడ్జెట్ ఉంటుందని సీతా రామన్ వెల్లడించారు