నీరవ్ 4,299 కోట్లని దాటించేశాడు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో బ్యాంకుల మీద ప్రజల నమ్మకం చాలావరకు తగ్గిపోయింది. ఇది చాలదన్నట్లు నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి బ్యాంకుల ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు నీరవ్ మోదీ ఎంత మొత్తం నొక్కేశాడో, దాని వల్ల ఎంత నష్టం వచ్చిందో లెక్కలేస్తున్నాయి. ఎన్‌పోర్స్‌మెండ్ డైరక్టరేట్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం నీరవ్‌ ఏకంగా 4,299 కోట్ల నిధులను దారిమళ్లించాడు. తన సొంత ఖాతాలకు, బంధువుల ఖాతాలకు, నకిలీ కంపెనీలకు వీటిని తరలించాడు. వీటిని తరలించేందుకు నీరవ్‌ ఏకంగా 15 నకిలీ కంపెనీలను సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. మరి ఇవి ఎంతవరకు తిరిగివస్తాయో అనుమానమే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu