మోడీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్

 

 

 

ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరుకానున్నారు. ఈ మేరకు పీఎంఎల్ పార్టీ అధికారికంగా ప్రకటనను జారీ చేసింది. నవాజ్ షరీఫ్ పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ కూడా వస్తున్నారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని రావడం ఇదే ప్రథమం. షరీఫ్ రాకతో భారత్-పాకిస్థాన్ మధ్య కొత్త అధ్యాయం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పే ఈ అవకాశాన్ని వదులుకోవద్దని విదేశాంగ శాఖ కార్యాలయం ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu