సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పులు.. దేశ వ్యాప్తంగా హై అలర్ట్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మది ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా జరిపిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యింది. భారత్ నిర్వహించిన మెరుపుదాడులలో ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ  నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత భూభాగంపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులకు భారత్ సేనలు దీటుగా బదులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (మే7) పాకిస్థాన్ విచక్షణా రహితంగా, ఏకపక్షంగా భారత భూభాగంపైకి జనావాసాలు లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పది మంది సాధారణ పౌరులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సేనలు ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది.  

పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది.  యూరీ, కుప్వారా, రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో పాక్ సేనల కాల్పులకు భారత్ సైన్యం దీటుగా బదులిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధమౌతోంది. కాగా ఇప్పటి వరకూ పాక్ జరిపిన కాల్పులలో నలుగురు చిన్నారులు సహా పదిహేను మంది మరణించారు. భారత్ దీటుగా జరిపిన కాల్పులలో పలువురు పాకిస్థాన్ సౌనికులు మరణించినట్లు సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu