మోడితో భేటి అవ్వనున్న బాబు
posted on Oct 2, 2013 9:06AM

రాష్ట్రంతో పాటు, కేంద్రంలోనూ ఎన్నికల వేడి మొదలవుతుండటంతో చంద్రబాబు కేంద్ర రాజకీయలమీద దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పలువరు జాతీయ నాయకులతో చర్చించిన చంద్రబాబు బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో బిజెపికే విజయావకాశాలు ఎక్కవేని అన్ని సర్వేలు చెపుతుండటంతో బాబు కూడా బిజెపితో పొత్తు దిశగా పావులు కదుపుతున్నారు.
అందులో బాగంగానే బుధవారం డిల్లీకి వెళుతున్న ఆయన బిజెపి ప్రదాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడితో సమావేశం అవుతారన్న వార్త బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర పరిస్థితులు తెలంగాణ ఏర్పాటు వంటి అంశాలను ఆయనతో చర్చించనున్నారు.
అయితే గతంలో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా బలంగా ప్రయత్నించిన బాబు, ఆ ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఇప్పుడు బిజెపితో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు.