జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’

జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు. దీనికి గురించి మానసిక నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూ వుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్‌కి ఈ వ్యాధి వుందని చెబుతున్నారు. 

ఈ నార్సీ మానసిక వ్యాధి వున్న వ్యక్తులు తనకు ఫాలోవర్లను పెంచుకుంటారు. ఇతను పదేపదే చెప్పే అబద్ధాలను అతని ఫాలోవర్లు నిజమని నమ్ముతారు. దాన్ని వ్యాప్తి చేస్తూ విష వలయాన్ని సృష్టిస్తారు. ఆ విషవలయం టార్గెట్ అమాయకమైన మహిళలు, వృద్ధులు... ఇంకా లోకం పోకడ పెద్దగా తెలియని అమాయక యువత. జగన్‌కి వున్న మానసిక వ్యాధిని ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. షార్ట‌కట్‌లో ‘నార్సీ’ అని వ్యవహరిస్తారు. ఇది ఒక భయంకరమైన మానసిక రుగ్మత. ఈ జబ్బు వున్నవాళ్ళు మొత్తం అబద్ధపు బతుకు బతుకుతారు. ఫేక్ బతుకు బతుకుతారు. వాళ్ళ జీవితంలో ‘ప్రేమ’ అనే మాటే వుండదు. వాళ్ళని వాళ్ళు కూడా ప్రేమించుకోరు.. వాళ్ళ ఇగోని మాత్రమే ప్రేమిస్తారు. వాళ్ళ చుట్టూ వున్న మనుషుల్ని కాదు కదా.. కన్న తల్లి, తండ్రితో సహా సొంత రక్త సంబంధీకులను, చివరికి తోబుట్టువులతో సహా ఎవర్నీ ప్రేమించరు. చివరికి కన్న బిడ్డలను కూడా ప్రేమించరు. సాధారణంగా సమాజంలో హత్యలు చేసే తల్లిదండ్రులు ఈ నార్సీ కోవకే చెందుతారు. ఇలాంటి వారు మేకవన్నె పులుల మాదిరిగా ప్రశాంత వదనంతో కనిపిస్తారు.  కానీ వాళ్ళో లోపల ఒక కాష్టం రగులుతూనే వుంటుంది. వైసీపీలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావచ్చు, నాయకురాలు కావచ్చు కచ్చితంగా ‘నార్సీ’ అయి వుండాలి. ఈ ‘నార్సీ’ విధానాన్ని ప్రజల మీద ప్రయోగించడం వల్ల ఒక్కోసారి రాజకీయంగా విపరీతమైన అధికారం వచ్చే అవకాశం వుంది. అందుకే దీన్ని ప్రజల మీద ప్రయోగించి వుంటారు. ఎగ్జాపుల్ చెప్పాలంటే, జర్మనీని సర్వనాశనం చేసిన హిట్లర్ ఒక నార్సీ, వెనిజులాని నాశనం చేసిన హ్యూగో చావెజ్ ఒక నార్సీ, అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ ఒక నార్సీ, తాలిబన్ సమూహాలు నార్సీ, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఒక నార్సీ. నార్త్ కొరియాలో మహిళలకు ఎంతమాత్రం స్వేచ్ఛ లేకుండా చేసిన కిమ్ ఈ మధ్య మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, మీరంతా నాకు కన్న తల్లితో సమానం అనగానే ఆ మహిళలందరూ కన్నీరు పెట్టుకుని కిమ్‌కి ప్రణామాలు చేశారు. ఈ నార్సీ లక్షణాలు వున్నవాళ్ళు అలాంటి వేషాలు వేస్తూ వుంటారు. 

సినిమాల్లో చూస్తే, రీసెంట్‌గా వచ్చిన ‘యానిమల్’ సినిమాలో హీరోది నార్సీ బుద్ధి. పాత సినిమాల్లో సూర్యకాంతం చేసే కేరెక్టర్లు నార్సీ బుధ్ధికి నిదర్శనాలు. ఆమే మొగుణ్ణి కొడుతుంది, తిడుతుంది.. కానీ తనను తిట్టినట్టు, కొట్టినట్టు హడావిడి చేస్తుంది. ప్రకాష్ రాజ్ ‘ఒంగోలు గిత్త’ సినిమాలో చేసిన కేరెక్టర్ నార్సీ. మార్కెట్ యార్ట్ ఛైర్మన్ అవడం కోసం సొంత బాబాయినే చంపేస్తాడు.. ఎంతోమంది ప్రాణాలు తీస్తాడు.. సింపతీ క్రియేట్ చేసుకుంటాడు. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ ధరించిన పాత్ర నార్సీ. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ప్రిన్సిపాల్ కేరెక్టర్ కూడా నార్సీయే.

ప్రజలందరికీ ఈ నార్సీల మూర్ఖత్వం గురించి, నార్సీల దుర్మార్గం గురించి, వాళ్ళ దాష్టీకం గురించి, వికృతమైన వాళ్ళ మానసిక స్థితి గురించి ప్రజలకు అవగాహన కలిగితే, రాజకీయాల్లో ఈ నార్సీ విధానాన్ని ఎవరు ఫాలో అవుతున్నారో పసిగట్టవచ్చు. 

జగన్ రాష్ట్రంలోని కంపెనీలను తరిమేయడంలో మూర్ఖత్వం మాత్రమే లేదు.. ఇసుకను ఆపేయడంలో కేవలం దాన్ని అమ్మేసుకుందామన్న ఆశ మాత్రమే లేదు.. అంతకు మించి వుంటాయి. ఒక్క ఇసుకను ఆపితే భవన నిర్మాణ రంగ కార్మికులు మొత్తం సర్వనాశనం అయిపోయారు కదా.. ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు కదా.. అలాంటి టైమ్‌లో వాళ్ళకి కాస్త డబ్బు ఇస్తే డబ్బు ఇచ్చిన వాడు గ్రేట్ అనుకుంటారు. ప్రజల బ్రతుకులు బాగుంటే, ఓ పదివేలో, పాతికవేలో ఇస్తే ఎందుకు గొప్పగా అనిపిస్తుంది చెప్పండి? అసలు ఉద్యోగాలే లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి యువత ఎగబడతారు. (ఇంకా వుంది)