జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 4

‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’... సంక్షిప్త రూపం ‘నార్సీ’ వైసీపీ అధినేత జగన్‌లో తారస్థాయికి చేరుకుందన్న విషయంలో పాఠకులకు స్పష్టత వచ్చిందని భావిస్తున్నాము. ఈ ‘నార్సీ’ వ్యాధిగ్రస్తులకు లక్షణాలు మరికొన్ని....

‘నార్సీ’ వ్యక్తులకు తమకంటే వేరే ఎవరూ గొప్పగా, ఛరిష్మా కలిగిన వ్యక్తుల్లా వుండటం ఇష్టం వుండదు. అలా ఎవరికైనా తనకంటే ఎక్కువ ఛరిష్మా వుంటే, అలాంటి వాళ్ళని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటాడు. ఆమధ్య సినిమావాళ్ళని తన దగ్గరకి పిలిపించుకుని జగన్ ఎంత అవమానించాడో చూశాం. సినిమావాళ్ళ కార్లన్నీ ఎక్కడో దూరంగా ఆపించేసి, వాళ్ళని చాలాదూరం నడిపించడం, వాళ్ళు చేతులు జోడించి నమస్కరిస్తుంటే, బిల్డప్పుగా కూర్చోవడం ఇవన్నీ ‘నార్సీ’ లక్షణాల కిందకే వస్తాయి. 

‘నార్సీ’ ధోరణిలో ఆంధ్రప్రదేశ్‌లో  మనం గమనిస్తున్న మరీ భయంకరమైన విషయాలు ఏమిటంటే, జగన్ ప్రభుత్వానికి కేవలం ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ మాత్రమే కాకుండా సైకోటిక్ బిహేవియర్ కూడా వున్నట్టు అనిపిస్తోంది. మేం చెప్పింది ఎవరైనా చేసి తీరాలి.. మేం చెప్పింది జరిగి తీరాలి. మేం అనుకుంటూ మూడు రాజధానులు ఏర్పడాలి. అమరావతి నాశనం అయిపోవాలనుకుంటే నాశనం అయిపోవాలి.. మాకు నచ్చిందే చట్టం అవ్వాలి.. మాకు నచ్చనివాళ్ళు అరెస్ట్ అయిపోవాలి. దానిని ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ కోర్టులేంటి.. మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటి అన్నట్టుగా ఈ సైకోటిక్ బిహేవియర్ తయారైంది. వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని అరెస్టు చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మహిళలైతే వారి కేరెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా కామెంట్లు చేయడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఎంతకైనా దిగజారిపోవడం, ఎలాంటి తప్పుడు వార్తలైనా ప్రచురించడం, తాము అరెస్టు చేయించనవాళ్ళని పోలీసులు కొడుతుంటే చూసి సంతోషపడటం... ఇవన్నీ శాడిస్ట్ బిహేవియర్ కిందకు వస్తాయి. ఇక యాంటీ సోషల్ బిహేవియర్... అంటే, చట్టాలకు, కోర్టులకు మర్యాద ఇవ్వకపోవడం, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జిలను తిట్టించడం, కో్ర్టులు అమ్ముడుపోయాయని ఆరోపించడం.. 

ఇలాంటి లక్షణాలు కలగలసిన వ్యక్తికి ఉదాహరణగా ‘హిట్లర్’ అని చెప్పవచ్చు. కానీ, హిట్లర్‌ ఎంత ‘నార్సీ’ అయినా, జర్మనీని ప్రపంచంలో టాప్‌లో నిలబెట్టాలన్న ఉద్దేశం వుంది. జగన్ దగ్గర అది కూడా లేదు. దేశంమీదగానీ, రాష్ట్రం మీదగానీ ఎలాంటి ప్రేమ లేదు. ఇలాంటి వాడు ఒక రాష్ట్రానికి గానీ, ఒక దేశానికి గానీ, ఒక జాతికి గానీ నాయకుడైతే నాశనం తప్ప ఇంకేమీ మిగలదు (ఇంకావుంది)