ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కు లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి నవంబర్ 1వరకూ శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగే ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ సందర్భంగా ఏపీలో ఐటీ పురోగతి లక్ష్యంగా ఆయన పలు కంపెనీల ప్రతినిథులతో సమావేశమౌతారు.

ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర పారిశ్రామిక రంగం వేగంగా   పురోగమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్లీ ఏపీలో అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

అలాగే ఐటీ రంగంలో కూడా పెట్టుబడులు వెల్లువెత్తతున్నాయి. తాజాగా టాటా రాష్ట్రంలో బ్రాంచి స్థాపనకు ముందుకు వచ్చింది. భారీగా ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా టాటా తన బ్రాంచ్ ను విశాఖపట్నంలో నెలకొల్పేందుకు రెడీ అయ్యింది. ఇక ఇప్పుడు నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో మరిన్ని ఐటీ కంపెనీలను  రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.