తమ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేశ్...


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. లోకేశ్ తమ ఆస్తల వివరాలు ప్రకటించడం వరుసగా ఇది ఏడోసారి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... యావత్ భారత్ దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఈ విధంగా తమ ఆస్తులను ప్రకటించలేదని అన్నారు. తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ ప్రకటించిన కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు..

* చంద్రబాబు నికర ఆస్తులు :రూ. 2.53 కోట్లు
* భువనేశ్వరి ఆస్తులు : రూ. 25.41 కోట్లు
* లోకేశ్ నికర ఆస్తులు: రూ. 15.21 కోట్లు
* బ్రహ్మణి నికర ఆస్తులు: రూ.15.01 కోట్లు
* దేవాన్ష్ నికర ఆస్తులు: రూ.11.54 కోట్లు