కొడుకును హీరో చేయాలని...

 

కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి జానకిరామ్‌ మొదటి నుంచీ సినిమాకి దూరంగా వుండేవారు. బాగా చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. అయితే తన తమ్ముడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభివృద్ధి చెందడానికి ఎంతో ప్రోత్సహించారు. కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కొన్ని సినిమాలను ఆయన నిర్మించారు. నందమూరి తారక రామారావు మనవడైన జానకిరామ్ తన కుమారుడికి కూడా తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. చిన్నవాడైన తన కుమారుడిని నటుడిగా చేయాలని జానకిరామ్ భావించారు. మాస్టర్ నందమూరి తారక రామారావు ప్రధాన పాత్రధారిగా ‘స్కేటింగ్ మాస్టర్’ అనే సినిమా కూడా రూపొందుతోంది. అలాగే తారక రామారావు ప్రధాన పాత్రధారిగా చిన్న పిల్లలతో ‘దాన వీర శూర కర్ణ’ సినిమాని రూపొందించాలని జానకిరామ్ భావించారు.