పగబట్టిన కోతి గారు

 

బీహార్‌లో ఒక కోతి రైలు డ్రైవర్ల మీద పగబట్టింది. రైళ్ళను చూస్తే చాలు దాని మీద ఎక్కి డ్రైవర్ల మీద దాడి చేస్తోంది. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం ఈ కోతి ఫ్రెండ్ ఒక రైలు కింద పడి మరణించింది. అప్పటి నుంచి ఈ కోతి రైలు డ్రైవర్ల మీద పగబట్టి వాళ్ళమీద దాడులు చేస్తోంది. బీహార్‌లోని పశ్చిమ చంపారా జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్లో ఓ కోతి రైలు కింద పడి మరణించింది. అప్పటి నుంచి ఆ కోతి ఫ్రెండ్ అయిన మరో కోతి ఆ స్టేషన్‌లో ఆగిన ప్రతి రైలు డ్రైవర్ మీద దాడి చేస్తోంది. ఈ కోతి దాడులకు రైలు డ్రైవర్లు భయపడిపోతున్నారు. ఈ ఊళ్ళో రైలు ఆపే ముందే రైలింజన్ కిటికీలన్నీ మూసేస్తున్నారు. కిటికీలు తెరిచి వుంటే ఇంజన్ లోపలకి వెళ్ళి డ్రైవర్ మీద దాడి చేస్తోంది. ఒకవేళ కిటికీలు మూసి వుంటే లోపలకి ఎలా వెళ్ళాలా అని ప్రయత్నిస్తోంది. ఇంజన్ మీద ఎగిరెగిరి దూకుతోంది. పాపం ఈ కోతి పగ ఎప్పటికి చల్లారుతుందో ఏమిటో...