మోడీ విధానాలతో పెచ్చరిల్లిన నిరుద్యోగం.. దేశంలో పెళ్లికాని ప్రసాదులు

నిరుద్యోగం యువత జీవితాలపై మరో విధంగా కూడా ప్రభావం చూపుతోందా? అంటే ఔననే అంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విద్యావంతులై ఉండి కూడా ఉద్యోగం లేకపోవడం వల్ల యువకులు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. ఉన్నత విద్య అభ్యసించినా దేశంలో యువత సామర్ద్యానికీ, అర్హతకు తగిన ఉద్యోగాలు లభించడం గగనమైపోయిందని అన్నారు. ఈ పరిస్థితి కారణంగానే వారు వయసు మీరిపోతున్నా అవివాహితులుగా మిగిలిపోతున్నారన్నారు.

నిరుద్యోగం కారణంగానే తమకు ఎవరూ పిల్లనివ్వడం లేదని పాతిక నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు పలువురు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శరద్ పవార్ చెప్పారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ రక్కసి విలయ తాండవం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాల కారణంగానే దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందని విమర్శలు గుప్పించారు.  

పుణెలో జరిగిన ‘జన్ జాగర్ యాత్ర’లో పాల్గొన్న పవార్.. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలైన సమస్యలపై దృష్టి సారించకుండా ఉండేలా విభజన రాజకీయాలు చేస్తూ కేంద్రం ప్రజా దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu