రో(త)జాకీయం!
posted on Oct 5, 2023 9:36AM
రాజకీయాన్ని రాజకీయంగా.. రాజకీయంలా చూడాలి. అలా అయితే రాజకీయం.. రాజకీయం అవుతుంది. అంతేకానీ.. ఇంట్లో గుట్టుగా తమ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ.. వాళ్లు బాగుంటే మనం బాగుంటామనుకొనే ఆడవాళ్లను సైతం బయటకు లాగేసి.. వాళ్లు ఇలాంటి వాళ్లు.. వీళ్లు అలాంటి వాళ్లంటూ.. ఇంటికే పరిమితమైన ఆడవారి మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టి మరీ దగుల్బాజీ రాజకీయం చేస్తూ.. ఓ విధమైన సైకో ఆనందం పొందడం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పాలక పక్షానికి అలవాటుగా మారి పోయింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన్ని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కావడం.. అలాగే ఈ అంశంపై మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తూ.. రోదించారు. ఈ నేపథ్యంలో గతంలో రోజా.. బుల్లెతెరపై పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రోజా ఓ చర్చా కార్యక్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌తో మాట్లాడిన అభ్యంతరక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నావ్? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టూ ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా చేరుకున్న సమయంలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ఆర్కే రోజు వ్యవహరించిన తీరు.. దీంతో నాటి అసెంబ్లీ స్పీకర్ కొడెల శివ ప్రసాదరావు.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సాక్షిగా రోజా తెలుగుదేశం మహిళా నాయకురాళ్లు వంగలపూడి అనిత, పీతల సుజాతలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.
ఏమమ్మా రోజా.. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీ పార్టీలోని మంత్రులు ఎంత మంది ఎన్ని బండ బూతులు మాట్లాడినా.. మీ పార్టీలోని పెద్దలు కానీ.. అగ్రనేతలు కానీ.. పోనీ పార్టీ అధ్యక్షుడు కానీ.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు.. అని ఎన్నడైనా అన్నారా? రాజకీయాన్ని రాజకీయంలాగా చూడండి.. రాజకీయంగా ఎదుర్కొండి అంతేకానీ.. ఇంట్లోని మహిళలపై వ్యక్తిగత విమర్శలకు దిగ వద్దంటూ.. ఎవరైనా.. ఎప్పుడైనా చెప్పారా? అలా చెప్పి ఉంటే... ఈ రోజు నీవు ఇలా ప్రెస్‌మీట్ పెట్టి.. కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి ఉండేది కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఓ నెటిజన్ అయితే.. అడు చెప్పాడా?... వీడు చెప్పాడా? నీ అమ్మ మోగుడు చెప్పాడా? అంటూ ఓ మంత్రిగారు.. ఏకంగా మీడియా ముందే తొడ కొట్టి మీసం మెలేసి,.. అరిచి పెడబొబ్బలు పెట్టి మరో మంత్రి, ఇక మరో ఆమాత్యుడైతే అయితే.. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆర్చుకు తీర్చుకొని ఛలోక్తులు విసురుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం గుర్తులేవా అని నిలదీశాడు. జగన్ మలి కేబినెట్‌లో చోటు దక్కించుకొన్న నోరున్న మంత్రుల్లో ఒకరు అదీ అసెంబ్లీలోనో.. బహిరంగ సభలో తెలియక.. మైకు కనబడగానే మైకాసురుడిలాగా మారిపోయి.. మాస్ హిస్టిరియాతో ఊగిపోవడం.. అలాగే ఇంకో మంత్రివర్యుడు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందంటే.. ఆ ఒక్కటి అడక్కు అంటూనే.. సంక్రాంతి పండగకు జనంలో కలిసి స్టెప్పులేస్తూ.. ఊగిపోవడమే కాకుండా.. ఆనంద తాండవం అంటే ఇలా ఉంటుందంటూ.. తాను నడిరోడ్డుపై వేసిన చిందులకు కొత్త పేరు పెట్టి మరీ ప్రాచుర్యం పొందడం.. ఇలా జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రుల గురించి చెప్పుకొంటూ పోతే.. ఓ పెద్ద పురాణమే అవుతుందని.. అందులో ఏ మాత్రం సందేహలే లేదని పేర్కొంటున్నారు.
ఇక రోజా.. తనపై టీడీపీ నేత విమర్శలకు కన్నీటి పర్యంతం కావడంతో ఇంకో నెటిజన్ అయితే తనదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా.. అసెంబ్లీకి ఎన్ని సార్లు హాజరయ్యారో ఏమో కానీ.. అలాగే ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఎన్ని సార్లు పర్యటించారో తెలియదు కానీ... మంత్రిగా తిరుమలలో శ్రీవారిని మాత్రం రికార్డు స్థాయిలో దర్శించుకొన్నారని.. కామెంట్ చేశాడు.
మరో నెటిజన్ అయితే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన తర్వాత.. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనే కాకుండా ఆయన ఫ్యామిలీపైన చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను.. ఓ మహిళగా రోజా ఆ రోజే ఖండించి ఉంటే.. నేడు ఇలా మీడియా ముందు కన్నీటి రోజాయణం వినించే పరిస్థితి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నాడు.
అయినా... ఇంట్లో చిన్న పిల్లవాడు తప్పు మాట్లాడితే.. మూతి మీద ఒకటి కొట్టి.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అని పెద్దవారు చెబితే... ఆ పిల్లవాడు మరోసారి అలా మాట్లాడడానికి జంకుతారని.. ఈ విషయం రోజాకూ తెలుసునని.. కానీ వైసీపీలో రోజా సహా పలువురు ప్రజా ప్రతినిధులు.. బూతుల పంచాంగమే మన పదవి యోగానికి ఆదృష్ట మంత్రమని అనుకొని పఠించారో ఏమో కానీ.. మీడియా ముందు అయినా.. వేదిక మీద అయినా.. ప్రజల ఎదుట అయినా.. మాస్ హిస్టిరియాతో ఊగిపోతూ మాట్లాడడం.. మినహా మరో పని చేయడంలేదని నెటిజన్లు అంటున్నారు.
ఇప్పటి వరకూ దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ప్రజా ప్రతినిధులు మా బూతులే మా భవిష్యత్తుఅన్నట్లుగా కదం తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు.
జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాని నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా.. అలాగే జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా లు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, చివరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం లాంటి ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలు వింటుంటే.. జగన్ ప్రభుత్వం ఇంతగా అపకీర్తిని,అప్రతిష్టను మూట కట్టుకుందంటే.. ఆ పాపం ఎవరిదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆ పాపంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ది సింహభాగమనీ, ఆ తరువాత పార్టీలోని మంత్రుల నుంచీ కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ ఆ పాపంలో భాగముందని చెబుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ నామ స్మరణతో చెక్క భజన చేస్తుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం చేతులు అడ్డం పెట్టుకొని, భుజాలు ఎగరేసుకొంటూ మరి ముసి ముసి నవ్వులు చిందించడం చూస్తుంటే ఈ విషయం ప్రస్ఫుటంగా అర్థమవుతోందని నెటిజన్లు సోదాహరణగా పేర్కొంటున్నారు.