మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రల కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్రమోడడీ  మే 2న అమరావతికి రానున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పనున పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది.

దాదాపు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నది.   నారాలోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ, సత్యకుమార్, కొల్లు రవీంద్రలతో  ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే  అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్య కుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారిని వీరపాండ్యన్ నునోడల్ అధికారిగా నియమించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu