టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టిన మావోయిస్టులు

గ్రీన్ హంట్ నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఖమ్మంజిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ చేసిన ఆరుగురు నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. ఇవాళ ఉదయం చత్తీస్ గఢ్ సరిహద్దులో వారిని వదలిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆరుగురు నేతలు చర్లకు చేరుకున్నారు.. మరికాసేపట్లో భద్రాచలం చేరకోనున్నారు.

కాగా భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు కిడ్నాప్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని.. లేదంటే టీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu