టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణికం ఠాకూర్ ఔట్?!
posted on Jan 4, 2023 11:13PM
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మాణిక్కం ఠాగూర్ రాజీనామా లేఖను పంపారు . దీంతో.. మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా తప్పించాలని కోరుతున్న తెలంగాణ సీనియర్లు రేవంత్ వర్గంపై పైచేయి సాధింనట్లైంది.
నిజానికి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించటానికి రావడానికి ముందే తనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని మాణికం ఠాకూర్ హై కమాండ్ ను కోరారు. ఇంత రాలం టీ కాంగ్ సీనియర్ల డిమాండ్ ను పట్టించుకోకుండా వదిలేసిన పార్టీ హైకమాండ్ ఎన్నికల సంవత్సరం కావడంలో అనివార్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించింది.
కాగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌గా మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.