అత్తమీద కోపం దుత్త మీద అంటే ఇదే..!

అత్తమీద కోపం దుత్త మీద చూపినట్టు అంటారు. అలాగే అనుమానం పెను భూతం అని కూడా అంటారు. ఉత్తర ప్రదేశ్ లోని వ్యక్తి చేసిన పని అచ్చం అలాగే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షాజాన్ పూర్ లో నివసించే అబిద్ అనే  తన పెంపుడు పిల్లిని పోగొట్టుకున్నాడు.

తానెంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని పొరుగింటి వ్యక్తే చంపేసి ఉంటాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే  పెనుభూతంగా మారింది.

అయితే తన కోపాన్ని ఆ వ్యక్తిపై ప్రదర్శించలేక ఆ కోపాన్ని ఎదురింటి వ్యక్తి పెంచుకుం టున్నపావురాలపై చూపాడు. తన పిల్లిని దొంగిలించాడన్నఅనుమానంతో పొరుగున ఉన్న వ్యక్తి పెంచుకుంటున్న దాదాపు 30 పావురాలను విషమిచ్చి చంపాడు.