మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు... ఆమె స్త్రీనా? లేక పురుషుడా?
posted on May 1, 2017 1:14PM
.jpg)
రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు అది కామన్. కానీ కొంతమంది మాత్రం కాస్త ఎక్కువ చేస్తుంటారు. తాము ఏం మాట్లాడుతున్నామో అని ఒళ్లుక తెలియకుండా నోరు జారుతుంటారు. ఇక్కడ ఓ బీజేపీ నేత కూడా అలానే చేశాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీను బీజేపీ రాష్ట్ర ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన పార్టీ ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...మమత ఓ నపుంసకురాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులే మమత చేస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ అసలు స్త్రీనా? లేక పురుషుడా? అన్న విషయం తమకు అర్ధం కావడం లేదని... ఆమె ఒక హిజ్రా అని తాను చెప్పగలనని సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది శ్వామపాద మండల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను టీఎంసీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.