ఆ తల ఖరీదు కోటి రూపాయలు

 

మావోయిస్టు నాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి తలకు ఎప్పటికప్పుడు వెల పెరుగుతోంది. గణపతిని పట్టి ఇచ్చినా, గణపతి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చినా కోటి రూపాయలు సదరు వ్యక్తులకు దక్కుతాయి. దేశాన్ని గడగడలాడిస్తున్న అనేకమంది ఉగ్రవాదుల తలలకూ లేని విలువ మావోయిస్టు గణపతికి వచ్చింది. గతంలో గణపతి తల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల వెలను ప్రకటించింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఆ వెలను కోటి రూపాయలకు పెంచింది. గణపతి జాడ గురించి చిన్న క్లూ ఇచ్చినా ఆ మొత్తాన్ని ఇచ్చేస్తామని ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu