ట్విస్టులకే ట్విస్ట్... ఇది మహా ట్విస్ట్... సీఎంగా ఫడ్నవిస్... డిప్యూటీగా అజిత్...
posted on Nov 23, 2019 10:09AM
నిజంగానే ఇది ట్విస్టులకే ట్విస్టు... క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో... ఎందుకంటే, నెలరోజులుగా మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో... ఎవ్వరూ ఊహించనివిధంగా ఎండ్ కార్డ్ పడింది... శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవగా... అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్.... డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఎన్నడు జరగనివిధంగా హడావిడిగా గవర్నర్ బంగ్లాలో ఈ తతంతం జరిగిపోయింది.
ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు తెల్లవారుజామున ఐదున్నర తర్వాత రాష్ట్రపతి పాలనను ఎత్తివేయగా, వెనువెంటనే...గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ... బీజేపీని శివసేనను ఇద్దరినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం రాజ్ భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవ్వరూ ఊహించనివిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్.... డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి కలకలం రేపాడు.
అయితే, మేనల్లుడు అజిత్ పవార్ ... బీజేపీతో చేతులు కలపడంపై శరద్ పవార్ విస్మయం వ్యక్తంచేశారు. తనకీ విషయం తెలియనే తెలియదన్నారు. కానీ, శరద్ పవార్ పై కాంగ్రెస్ పరోక్షంగా సెటైర్లు వేసింది. పవార్ జీ... మీరు చాలా గ్రేట్.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, శరద్ పవార్ ను ప్రధాని మోడీ పొగడటం... ఆ తర్వాత మోడీని పవార్ కలవడంతో.... అప్పుడే అనుమానాలు చేలరేగాయి. బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, కానీ... ఒకవైపు శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగానే, శరద్ పవార్ ను కాదని, అజిత్ పవార్... బీజేపీతో చేతులు కలిపాడంటే నమ్మడానికి ఆశ్చర్యం కలిగిస్తోంది.