స్టూడెంట్ పై.. ప్రొఫెసర్ లై*గిక టార్చెర్ ..

ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. సొంత ఇంట్లోనూ, బంధువుల్లోనూ, స్కూల్ లోనూ, కాలేజీ లోనూ, బస్టాండ్ లోనూ, ఎక్కడ చూసిన ఆడవాళ్ల పై జరుగుతున్న అసభ్య ఘటనలకు, దాడులకు వారు ఆవేదన చెబుతూనే ఉన్నారు. చదువు సంస్కారం లేని చిల్లరగాళ్ళ ఆటుపోటు మాటలకూ, వారిపై దాడులకు మహిళలు బలవుతూనే ఉన్నారు. విశ్వవిద్యాలయాలు దేవాలయాలు అంటారు. అధ్యాపకులను దేవులు అంటారు. మరి విద్యబుద్దులు చెప్పే గురువులే విద్యార్థులు పై లైంగిక వేధింపులకు పాలుపడితే. గురుసాక్షత్తు పరబ్రమ్మ అన్న పదాన్ని అపవిత్రం చేస్తే. 

మద్రాస్ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ తాను చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని  ఈ నెల 16వ తేదీన ఇతర విద్యార్థుల ముందు తనతో హెచ్‌వోడీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన శరీర భాగాలను తాకాడని 31 ఏళ్ల యువతి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే అతడిని కాపాడేందుకు యూనివర్సిటీ యాజమాన్యం నియమించిన ఇంటర్నెల్ కంప్లైంట్స్ కమిటీ ప్రయత్నిస్తోందని తెలిపింది. మనస్తాపానికి గురైన ఆ యువతి ఆదివారం యూనివర్సిటీలోని బాత్రూమ్‌లో ఆత్మహత్యాయత్నం చేయగా.  తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ఆమె సురక్షితంగా బయటపడింది. కాగా, ఆమెకు మద్దతుగా నలుగురు మగ విద్యార్థులు యూనివర్సిటీ బయట నిరసన వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu