‘మా’ కేసు మళ్ళీ వాయిదా

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికకు సంబంధించిన కేసు మళ్ళీ వాయిదా పడింది. ‘మా’ ఎన్నికలు పూర్తయినప్పటికీ, కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించాల్సి వుంది. ఈనెల 7వ తేదీన ఈ కేసును విచారించిన కోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది. 9వ తేదీన కోర్టు ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇస్తుందని సినీ వర్గాలు భావించాయి. అయితే కోర్టు ఈ కేసును ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఎప్పుడెప్పుడు కోర్టు అనుమతి ఇస్తుందా, ఫలితం ప్రకటించాలనా అని ఎదురుచూస్తున్న సినీ వర్గాలు ఈ నిర్ణయంతో మరోసారి నిరాశకు గురయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu