నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఎపిలో భారీ వర్షాలు 

నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు ​నైరుతి రాష్ట్రాలు విడిచి వెళ్లినప్పటికీ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఎపిలో  నంద్యాల, వైఎస్ ఆర్ , అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ , బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో   భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ  హెచ్చరికలు జారీ చేసింది.  అల్పపీడనం పశ్చి మ దిశగా  నెమ్మదిగా కదులుతున్నాయి. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు అల్పపీడనం వెళ్లనుంది అని  విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
రాబోయే రెండు మూడు రోజుల్లో రాయల సీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మ నాథ్  తెలిపారు.