లిబియాలో పడవ మునిక..100 మంది గల్లంతు

లిబియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ దేశ ప్రజలు పడుతున్న శ్రమ వారి ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా లిబియా నుంచి యూరప్‌ వెళ్లేందుకు మధ్యధరా సముద్రంలో వెళుతున్న ఒక శరణార్థుల పడవ నడిమధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 100 మంది గల్లంతు అయ్యారు. రంగంలోకి దిగిన ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో పడవలో 120 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu